తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇదేం చిత్రం రా సామి... శునకానికి భోగి పూజ - sankranti special

By

Published : Jan 16, 2023, 11:49 AM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

Sankranti Festival: సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి రోజున పిల్లలకు భోగిపళ్లు పోయటం తెలుగు సంప్రదాయం. అయితే గుంటూరులో ఓ కుటుంబం మాత్రం తమ ఇంట్లో పెంచుకుంటున్న శునకానికి కూడా భోగిపళ్లు పోసి సంబరాలు జరిపారు. శ్యామలానగర్​కు చెందిన గర్రె వంశీకృష్ణ, నాగరాజకుమారి దంపతులు తమ ఇంట్లో గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన శునకాన్ని పెంచుకుంటున్నారు. లక్కీ పేరుతో పిలుచుకునే ఈ కుక్కుపిల్లకు భోగి సందర్భంగా భోగిపళ్లు పోసి ఇంట్లో వారంతా ఆశీర్వదించారు. లక్కీ కూడా చిన్నపిల్లల మాదిరిగా బుద్ధిగా కూర్చుని పూజలో పాల్గొంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తమ పిల్లల మాదిరిగానే లక్కీని పెంచుకుంటున్నామని.. అందుకే దానికి కూడా మంచి జరగాలని, ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ భోగి పూజ చేసినట్లు నాగరాజకుమారి తెలిపారు.  

ఇవీ చదవండి:

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details