10 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం - ముంబయి ఫైర్ యాక్సిడెంట్
Mumbai Kanjurmarg fire accident: ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కంజూర్‌మార్గ్‌లోని ఎన్జీ రాయల్ పార్క్ ప్రాంతంలోని 10 అంతస్తుల భారీ భవనంలో మంటలు చెలరేగాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు. అపార్ట్‌మెంట్ పై రెండు అంతస్తుల్లో భారీగా మంటలు, పొగ వ్యాపించాయి.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST