అలరించిన కళాంజలి ఫ్యాషన్ ఫో - vijayawada
యువతీ యువకుల ర్యాంప్ వాక్, చిన్నారుల ముచ్చటైన అడుగులతో విజయవాడలో జరిగిన కళాంజలి ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. సతీష్ అడ్డాల క్రియేషన్స్ ఆధ్వర్యంలో మొగల్రాజపురంలో 'మిస్టర్ అండ్ మిస్ విజయవాడ' అందాల పోటీలు అందరినీ అలరించాయి. కళాంజలి వస్త్రాలతో పోటీదారులు సందడి చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ నటి భవ్యశ్రీ హాజరయ్యారు. మిస్టర్ విజయవాడగా వజా, మిస్ విజయవాడగా లహరి ఎంపికయ్యారు.