కళాంజలి సొగసులు
హైదరాబాద్ మాదాపూర్‌లోని నిఫ్ట్ కళాశాలలో నిర్వహించిన స్పెక్ట్రమ్-2020 ఫెస్టివల్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో.. ప్రముఖ వస్త్రనిలయం కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షో వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. యువతీయుకులు వివిధ రకాలైన దుస్తులను ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో అలరించారు. ఆధునిక, సంప్రదాయ మేళవింపుతో రూపొందించిన కళంకారి దుస్తుల్లో సొగసరులు తమ హంసనడకలతో అదరహో అనిపించారు.