చల్లారని ఎల్లోవెస్ట్ ఉద్యమం.. రోడ్లపైకి వేల మంది - reforms
ఫ్రాన్స్‌లో ఎల్లోవెస్ట్ ఉద్యమం చల్లారడం లేదు. వరుసగా 21వ వారాంతం కూడా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. పారిస్ నగర వీధులన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. సామాజిక, ఆర్థిక సంస్కరణల కోసం ఫ్రాన్స్ ప్రజలు ఎల్లోవెస్ట్ ఉద్యమాన్ని చాలా కాలంగా కొనసాగిస్తూనే ఉన్నారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఇది సవాల్‌గా మారింది.