ఎగిసిపడిన సముద్ర అలలు.. నగరాన్ని కమ్మేసిన నురుగు - spain glorian flood
స్పెయిన్ తోసా డి మార్ తీర నగరాన్ని సముద్రపు నురుగు కప్పేసింది. గ్లోరియా తుపాను కారణంగా అలలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. ఫలితంగా రోడ్లు, ఇళ్లూ, రెస్టారెంట్లూ, ఇలా అన్ని ప్రాంతాలు నురుగు మయమయ్యాయి. శిలాజ ఇంధనం, మురుగు నీరు, డిటర్జెంట్ల నుంచి వెలువడే కాలుష్య కారకాలు నురుగు ఏర్పడటానికి ప్రధాన కారణమని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. ప్రజలు వీధులను, ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Last Updated : Feb 17, 2020, 11:07 PM IST