చెలరేగిన ఫ్లాయిడ్ జ్వాలాగ్ని.. కూలిన ప్రముఖ విగ్రహాలు! - protests against floyd death
అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంఘీభావం తెలుపుతూ.. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా బ్రిటన్‌లో నిరసనలు హోరెత్తాయి. వందలాదిమంది ఆందోళనకారులు ఇంగ్లండ్ బ్రిస్టల్, మన్రో పార్క్‌లోని 17 వ శతాబ్దపు ఇంగ్లీష్ వ్యాపారి ఎడ్వర్డ్ కోల్స్టన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆపై ఎడ్వర్డ్ విగ్రహాన్ని నదిలో పడేసి.. అమెరికా నల్లజాతీయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బ్రిటన్‌లోని రాబర్ట్ ఇ. లీ విగ్రహంతో పాటు మరిన్ని అమెరికన్ల విగ్రహాలను ఇలాగే కూల్చుతామని నినాదాలు చేశారు. ఇక అటు అమెరికాలోనూ జనరల్ విలియమ్స్ కార్టర్ విగ్రహాన్ని ఆందోళనకారులు కూల్చేశారు.