నగర వీధుల్లో హాట్ ఎయిర్ బెలూన్ల మిరుమిట్లు - మెక్సికోలో బుడగల సందడి
గతేడాది కరోనా కారణంగా రద్దు అయిన అల్బుకెర్కీ అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్ (Mexico Balloon Festival ) న్యూ మెక్సికోలో తిరిగి ప్రారంభంమైంది. సుమారు 540 హాట్ ఎయిర్ బెలూన్లను ఎగరవేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తంగా ఈ కార్యక్రమం నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు కొనసాగనుంది. వివిధ పరిమాణాలు, రంగులతో ఈ బెలూన్లు. ఆకాశానికి రంగులు అద్దినట్లుగా కనిపిస్తూ.. వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా 2020లో ఈవెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు.