అగ్నిపర్వత విస్ఫోటనం- నదిలా ప్రవహిస్తోన్న లావా! - Volcano Eruption today
స్పెయిన్‌లోని (Spain volcano eruption 2021) లా పాల్మా దీవిలో విస్ఫోటం (Volcano Eruption today) చెందిన అగ్నిపర్వతం (la palma volcano) నుంచి లావా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. లావా ప్రవాహం ధాటికి దీవిలోని 946 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇప్పటివరకు 6000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సెప్టెంబరు 19న మొదలైన విస్ఫోటనం.. ఇంకా కొనసాగుతోంది. నిప్పులు చిమ్ముతూ.. సమీప ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తోంది.