భారీ వరదలకు స్పెయిన్ అతలాకుతలం - నలుగురు మృతి
రెండు రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలకు స్పెయిన్ అతలాకుతలమవుతోంది. వానలకు కొన్ని ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. మధ్యదరా సముద్ర తీర ప్రాంతాలైన వెలెన్సియా, ముర్సియా, తూర్పు అండలూసియా వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారులు వరదలలో చిక్కుకున్న వారిని హెలికాఫ్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సంవత్సరంలో ఇదే అత్యధిక వర్షపాతమని వాతావరణశాఖ తెలిపింది. ఈ వరదలకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
Last Updated : Sep 30, 2019, 1:39 PM IST