స్పెయిన్లో కార్చిచ్చు... వేలాది ఎకరాలు దగ్ధం - బూడిద
స్పెయిన్ దేశంలోని కానరీ ద్వీపంలో కార్చిచ్చు చెలరేగింది. దట్టమైన పొగలు ద్వీపం మొత్తం ఆవరించాయి. దాదాపు 1000 హెక్టార్లు(2,470 ఎకరాల) వరకు మంటలు వ్యాపించి అడవి కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వందలాది మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. శనివారం జరిగిన ఈ ఘటనకు కారణాలు ఇంకా తెలియలేదు. 200 మంది అగ్నిమాపక సిబ్బంది...10 వాటర్ డంపింగ్ విమానాలు మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Last Updated : Sep 26, 2019, 5:35 PM IST