మంచు వర్షంతో మురిసిన ప్యారిస్ ప్రజలు - హిమపాతంలో ఫ్రాన్స్ ప్రజలు
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఈ సీజన్లోనే తొలిసారి మంచు వర్షం కురిసింది. మంచు తుంపరుల మధ్య ఈఫిల్ టవర్‌తో పాటు పలు కట్టడాలను చూస్తూ ప్రజలు మురిసిపోయారు. పిల్లలు, పెద్దలు మంచులో సందడిగా గడిపారు. మంచుగడ్డలతో రకరకాల ఆకృతులను చేయడంతో పాటు, మంచుతో బంతులను చేసి సరదాగా ఆడుకున్నారు పిల్లలు.