పల్టీలు కొట్టిన కారు.. దృశ్యాలు వైరల్ - కార్ రేసింగ్
రేసులో కార్లు వేగంగా దూసుకెళుతుంటే ఆ మజానే వేరు. డ్రైవర్లు ఎంతో అప్రమత్తతతో ఉండాలి. లేదంటే రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతాయి. చిలీ దేశంలో జరిగిన 'ర్యాలీ చిలీ' కారు రేసులో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రపంచ ర్యాలీ ఛాంపియన్ షిప్ విజేత, బెల్జియం డ్రైవర్ థియరీ న్యూవిల్లే కారు ప్రమాదానికి గురైంది. 8వ స్టేజ్లో వేగంగా పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కానీ ఈ బెల్జియం డ్రైవర్,అతని కో డ్రైవర్ నికోలస్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.