అమెరికా అధ్యక్షుడి ఐస్‌క్రీం సరదాలు - బైడెన్ వార్తలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. విస్కాన్సిన్ రాష్ట్ర పర్యటన సందర్భంగా అక్కడున్న ఓ ఐస్‌క్రీం పార్లర్‌ను సందర్శించి స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. లాస్ క్రోస్సీలోని పెర్ల్ పార్లర్లో స్ట్రాబెరీ, క్రీమ్, కుకీలు ఉన్న డబుల్ స్కూప్ ఐస్క్రీంను ఆర్డర్ చేశారు. ఆ సమయంలో బైడెన్‌తో పాటు విస్కాన్సిన్ గవర్నర్, సెనేటర్లు కూడా ఉన్నారు. ఇదివరకు కూడా క్లీవ్‌ల్యాండ్ పర్యటనలో భాగంగా ఇదే విధంగా అక్కడ ఉన్న ఓ ఐస్‌క్రీం దుకాణానికి సప్రైజ్ విజిట్ చేశారు.