ఎట్నా విస్ఫోటం.. భారీగా ఎగిసిపడుతున్న లావా - మౌంట్ ఎత్నా అగ్ని పర్వతం
యూరప్‌లోనే అత్యంత క్రియాశీలకంగా ఉండే ఇటలీలోని మౌంట్ ఎట్నా అగ్ని పర్వతం బుధవారం రాత్రి నిప్పులు చిమ్మింది. ఆకాశాన్ని తాకేంతగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. బిలం నుంచి పెద్దఎత్తున లావా ఉబికి వస్తూ దిగువకు జారుతోంది. ఎర్రటి జ్వాలలు భయంగొల్పే రీతిలో కనిపిస్తోంది.