షాపింగ్ మాల్లో మంటలు- కోట్లు ఖరీదు చేసే వస్త్రాలు దగ్ధం - Los Angeles latest news
అమెరికా లాస్ ఏంజలెస్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ అలమేడాలోని ఓ వాణిజ్య సముదాయంలో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. వస్త్రాలతో నిండి ఉన్న ఓ పెద్ద భవనం మొత్తం మంటలు అంటుకున్నాయి. దుస్తులు, సామగ్రి కాలిపోయాయి. మైళ్ల మేర దట్టమైన పొగ కమ్ముకుంది. 80 వేల చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న భవంతి పైకప్పు కూలిపోయింది. దాదాపు 100 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఘటనకు కారణం తెలియరాలేదు.