పీఓకేలో పాక్- చైనాకు వ్యతిరేకంగా నిరసన సెగలు - Muzaffarabad protests news
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నీలం-జీలం నదిపై నిర్మిస్తున్న మెగా డ్యామ్ నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరుతూ స్థానిక ప్రజలు పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు. ముజఫరాబాద్‌కు భారీ సంఖ్యలో చేరుకున్న డ్యామ్ నిర్వాసితులు ప్రాజెక్టు పనులు ఆపాలని కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పాకిస్థాన్, చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి పాక్ డ్యామ్‌లను నిర్మిస్తోందని ఆరోపించారు. నీలం-జీలం నదిపై చైనా సహకారంతో పాకిస్థాన్ మెగా నీటి పారుదల ప్రాజెక్టును నిర్మిస్తోంది.