పారిస్ అందాలు: కరోనాకు ముందు.. ఆ తర్వాత
ఫ్రాన్స్ అనగానే.. ఆ దేశ రాజధాని పారిస్ మదిలో మెదులుతుంది. ముఖ్యంగా ఈఫిల్ టవర్. ఎప్పుడూ పర్యటకులతో కళకళలాడుతుంటుంది. కానీ ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. పారిస్ నగర వీధులు కరోనా కారణంగా ప్రస్తుతం నిర్మానుష్యంగా మారాయి. పర్యటకులతో కిటకిటలాడే ఈఫిల్ టవర్ వద్ద జన సంచారమే లేదు. ప్రసిద్ధిగాంచిన వాణిజ్య ప్రాంతం ఛాంప్స్-ఎలిసీస్ వద్ద నేడు దుకాణాదారులు, సందర్శకుల సందడి కరవైంది. వైరస్ విజృంభణతో లాక్డౌన్ను మరో ఎనిమిది వారాలు పొడిగించిన నేపథ్యంలో అందాల నగరం మరింత బోసిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రసిద్ధ ప్రాంతాల్లో కరోనాకు ముందు, ఆ తర్వాత పరిస్థితులపై ఓ లుక్కేద్దాం.