ఇటలీ: పర్యావరణవేత్తపై అభిమానంతో.. - ITALIAN LAND ARTIST
ప్రముఖ పర్యావరణవేత్త, నోబుల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన 16ఏళ్ల గ్రేటా థన్బర్గ్పై తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు ఇటలీలోని ఓ కళాకారుడు. వెరోనా నగరంలో 27వేల చదరపు మీటర్ల పరిణామంలోని పొలంలో ఆమె రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు డారియో గంబరిన్. వచ్చేవారం పర్యావరణపై ఐరాసలో ఓ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో గీటా పాల్గొననుంది. ఈ నేపథ్యంలో ఆమె చిత్రపటాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు గంబరిన్. ఇందుకోసం ట్రాక్టర్ని ఉపయోగించాడు. గతంలోనూ ఇదే తరహాలో అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్ చిత్రాలనూ గీసి తన అభిమానాన్ని చాటాడు.
Last Updated : Oct 1, 2019, 6:48 AM IST