తెలంగాణ

telangana

ETV Bharat / videos

బైడెన్​తో బాక్సింగ్​ మ్యాచ్​కు సై అంటున్న ట్రంప్​ - బెడన్​కు ట్రంప్​ సవాల్​

By

Published : Sep 10, 2021, 3:49 PM IST

Updated : Sep 10, 2021, 4:53 PM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో బాక్సింగ్​ మ్యాచ్​కు సై అంటున్నారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​. మాజీ హెవీవెయిట్​ ఛాంపియన్​ ఎవాండర్​ హోలీఫీల్డ్​, విటోర్​ బెల్​ఫోర్ట్​ మధ్య శనివారం జరగనున్న ఎగ్జిబిషన్​ బాక్సింగ్​ మ్యాచ్​కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఫోన్​ ద్వారా మాట్లాడారు ట్రంప్​. ఈ సందర్భంగా.. 'నేను ఎవరినైనా సవాల్​ చేయాల్సి వస్తే.. బహుశా జో బైడెన్​పై సులభంగా గెలుస్తాను. నన్ను జైల్లో పెడతానని గతంలో చెప్పారు. అలా చేస్తే ఆయనే పెద్ద సమస్యల్లో చిక్కుకుంటారు. నా ఆలోచన ప్రకారం మ్యాచ్​ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ఓడిపోతారు' అని పేర్కొన్నారు ట్రంప్​.
Last Updated : Sep 10, 2021, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details