అమెజాన్ కార్చిచ్చు: 'మమ్మల్ని బూడిద చేయకండి' - bolivia protests
బొలివియా రాజధాని లా పాజ్‌లో వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుపై ప్రభుత్వం, ప్రపంచ దేశాలు సరైన శ్రద్ధ వహించడంలేదని మండిపడ్డారు. 'మీ ఉదాసీన వైఖరి మమ్మల్ని బుగ్గి చేస్తుంది' అని బ్యానర్లు ప్రదర్శించారు. తమ దేశంలో దాదాపు 9లక్షల హెక్టార్లు దావానలానికి బూడిదైందని బొలివియా అధ్యక్షుడు ఎవో మోరాల్స్ ఆదివారం తెలిపారు. స్పెయిన్, చిలీ, పరాగ్వే దేశాలు సాయం అందించేందుకు ముందుకొచ్చాయని చెప్పారు.
Last Updated : Sep 28, 2019, 7:29 AM IST