ముంచెత్తిన వరద- తెగించి కాపాడిన రెస్క్యూ టీం - చైనా వార్తలు లేటెస్ట్
కుండపోత వానలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. హెనాన్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు వరదల గుప్పిట్లో చిక్కుకున్నాయి. వరద ఉద్ధృతికి రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో ఓ వ్యక్తి చెట్టుపై చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రాణాలకు తెగించి అతడిని కాపాడారు. తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరోవైపు వరదల ధాటికి హెబీ నగరం సైతం మునిగిపోయింది. కార్లు రోడ్లపైనే నిలిచిపోయాయి. ప్రజలు వాహనాల నుంచి బయటకు రాలేక ఇబ్బందిపడ్డారు. వీరిని రక్షించేందుకు అగ్నిమాపక విభాగం మూడు ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేసింది.