ఉత్తర ఇటలీని వణికిస్తోన్న వరదలు - ఇటలీ
భారీ వర్షాలకు ఉత్తర ఇటలీ వణికిపోతోంది. ఫోర్లి రాష్ట్రంలో ప్రవహించే సావియో నది ఉప్పొంగి పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. వాతావరణ మార్పులతో మిలాన్ అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడింది. సెసేనా, రవెన్నా రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Last Updated : May 14, 2019, 7:59 AM IST