బ్రెజిల్ జలమయం.. రహదారులపై పడవ ప్రయాణం - వరదలు
బ్రెజిల్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు విటోరియా నగరం సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు పూర్తిగా మునిగిపోవడం వల్ల కొందరు పడవల్లో ప్రయాణిస్తున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించింది. విటోరియాలో 24 గంటల్లో 240 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరదల వల్ల విలావెల్హో నగర మేయర్ అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
Last Updated : May 20, 2019, 6:47 AM IST