అర్జెంటీనాలో కార్చిచ్చు- పురాతన చర్చి దగ్ధం
అర్జెంటీనాలోని అడవుల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. కార్డోబా రాష్ట్రంలోని పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఎగిసిపడుతున్న కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు సుమారు 300మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వీటి కోసం హైడ్రాంట్ విమానాల సేవలనూ వినియోగించుకున్నారు. అప్రమత్తమైన అధికారులు.. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. మంటల ధాటికి.. లా కేండలేరియాలోని యునెస్కో వారసత్వ ప్రదేశమైన ప్రఖ్యాత చర్చి కాలిపోయింది.