అమెరికా సైనిక స్థావరంలో మంటలు - ఒకినావా కడేనా ఎయిర్ బేస్
జపాన్ ఒకినావాలోని అమెరికా సైనిక స్థావరంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదకర వస్తువులు ఉన్న ఆ గోదాము పైకప్పు కాసేపటికే కుప్పకూలింది. అప్రమత్తమైన అధికారులు అక్కడి సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక దళాన్ని రంగంలోకి దింపారు.