లాస్ వేగాస్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి - Fire Accident in Los Vegas, Kills At least 6
లాస్ వెగాస్‌లోని ఓ భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటల్లో చిక్కుకుని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. భయంతో భవనం నుంచి కిందకు దూకడం వల్లే ఎక్కువమంది గాయపడ్డారని వివరించారు.