అమెరికాలో తుపాను బీభత్సం.. పట్టణాలను ముంచెత్తిన వరదలు
అమెరికాలో ఆదివారం (us cyclone) తుపాను బీభత్సం సృష్టించింది. శాన్ఫ్రాన్సిస్కో తీర ప్రాంతంలో వరదలు సంభవించాయి. బర్కిలీలో వీధులు జలమయంగా మారాయి. ఓక్లాండ్ తీరంలో టోల్ ప్లాజాను వరదలు ముంచెత్తాయి. నాపా, సోనోమా కౌంటీలలో నదులు ఉప్పొంగి ప్రవహించాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల కాలిఫోర్నియా జాతీయ రహదారిని మూసివేశారు. తుఫాను ప్రభావం (us cyclone) ఒరెగాన్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్ సరఫరా నిలిచి పదివేల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. గ్రేటర్ సీటెల్ ప్రాంతంలో ఓ వాహనంపై చెట్టు పడి ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు వెల్లడించారు. అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఆయా ప్రాంతాల్లో తుపాను ముగిసేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలిఫోర్నియాలో ప్రస్తుతం వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లోనే కొద్దిరోజుల క్రితం కార్చిచ్చు విధ్వంసం సృష్టించింది.