ఊపిరి బిగబట్టేలా చేసే క్లిఫ్ డైవింగ్ పోటీలు...! - గ్యారీ హంట్
స్పెయిన్లో 2019 రెడ్ బుల్ క్లిఫ్ డైవింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ దేశాలకు చెందిన ఔత్సాహికులు పాల్గొన్నారు. పోటీదారులు చేసిన డైవింగ్ విన్యాసాలు ఆద్యంతం చూపరులను ఆకట్టుకున్నాయి. పురుషుల విభాగంలో బ్రిటన్కు చెందిన గ్యారీ హంట్, స్త్రీల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన రియాన్నన్ ఇఫ్లాండ్ విజేతలుగా నిలిచారు. ఇఫ్లాండ్ ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈ టైటిల్ గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన మెుట్ట మెుదటి మహిళ ఇఫ్లాండ్.
Last Updated : Sep 30, 2019, 4:36 PM IST