బెల్లా తుపానుతో ఇంగ్లాండ్లో భారీ వర్షాలు - river great ouse
ఇంగ్లాండ్లో బెల్లా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఓస్ నది ఉప్పొంగి.. బెడ్ఫోర్డ్షైర్లో వందలాది ఇళ్లు నీటమునిగాయి. బాధితులు అంతా ప్రభుత్వ పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు ఇంకా ప్రతికూలంగా మారుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 70 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.