మంచులో రెండున్నర గంటలు ఉండి రికార్డు! - ఆస్ట్రియా క్రీడాకారుడు సరికొత్త రికార్డు
మనం చిన్నపాటి మంచు ముక్కను పట్టుకుంటే.. కొద్ది సేపటికే చేతులు కొయ్యబారి.. దాన్ని పక్కకు పడేస్తాం. అలాంటిది ఆస్ట్రియాకు చెందిన జోసెఫ్ కోబెర్ల్ అనే క్రీడాకారుడు ఏకంగా రెండు గంటల 30 నిమిషాల 57 సెకన్ల పాటు మంచులో నిలుచున్నారు. దీనితో ఇంతకుముందు తనమీదున్న ప్రపంచ రికార్డును తానే చెరిపేశారు. చిన్న స్విమ్ ట్రాక్ మాత్రమే ధరించి పెద్ద పెట్టలో నిలుచున్న జోసెఫ్ చుట్టూ 200 కిలోలకు పైగా మంచు ముక్కలు నింపారు.