తెలంగాణ

telangana

ETV Bharat / videos

జూలో ​క్రిస్మస్​ వేడుకలు.. జంతువులకు విందు - christmas celebration in zoo

By

Published : Dec 21, 2020, 4:59 PM IST

ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓ జంతుప్రదర్శనశాల నిర్వాహకులు ముందస్తు క్రిస్మస్​ వేడుకలను విభిన్నంగా జరుతున్నారు. జంతువులకు పండుగ అనుభూతిని పంచుతూ.. తమ ప్రత్యేకతను చాటుతున్నారు. సిడ్నీలోని 'తరోంగా జూ' సిబ్బంది.. క్రిస్మస్​ను పురస్కరించుకొని జంతువులకు ఇచ్చే ఆహారాన్ని 'హ్యాపీ క్రిస్మస్'​ అనే అక్షరాల్లో అమర్చి పెడుతున్నారు. వాటిని కొత్త ప్రదేశాల్లో ఉంచి ఆటలు ఆడిస్తున్నారు. జీరాఫీలకు ఆపిల్​ పండ్లు, ఆఫ్రికన్​ సింహాలకు శాంటా ట్రీలు అందిస్తున్నారు. ఇచ్చిన ఆహారాన్ని, వస్తువులను కనుగొనేందుకు.. వాటిపై లేపనాలను రాస్తున్నారు. ఈ విధంగా చేయడం ఇదే మొదటిసారి అని అంటున్నారు సిబ్బంది. ఈ ఏడాది క్రిస్మస్‌ వేడుకలను తమ జూలో ప్రత్యేకంగా చేయాలనే ఈ విధంగా చేశామని చెబుతున్నారు నిర్వాహకులు.

ABOUT THE AUTHOR

...view details