బురద పండుగ: సరదాగా చిందేస్తూ, సందడి చేస్తూ - మడ్ లింబో
ఒక పెద్ద బురద గుంత. అందులో వందల మంది చిన్నారులు. ప్రపంచాన్ని మర్చిపోయి సరదాగా చిందులేశారు. కలిసి ఆడుకున్నారు. అమెరికా మిషిగన్‌లోని వేన్ కౌంటీలో నిర్వహించిన వార్షిక బురద పండుగలో కనిపించాయి ఈ దృశ్యాలు. 'మడ్ లింబో', 'వీల్ బ్యారో రేస్' వంటి ఆటలు బాగా ఆడిన వారికి బురద రాజు, బురద రాణి కిరీటాలు అందజేశారు.