కాంగోలో అగ్నిపర్వతం పేలి 15 మంది మృతి - కాంగోలో అగ్నిపర్వతం
కాంగోలోని ఇరగోంగో అగ్ని పర్వతం విస్ఫోటనం చెందిన ఘటనలో 15 మంది మరణించారు. 170 మందికి పైగా చిన్నారులు గల్లంతయ్యారు. అగ్ని పర్వతానికి సమీపంలోని గోమా నగరంలో 500కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. గోమా నగరాన్ని విడిచి 5,000 మంది రువాండ సరిహద్దుల వద్ద సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లగా, మరో 25,000 మందికి సేక్ ప్రాంతంలో ఆశ్రయం కావాలని యునిసెఫ్ తెలిపింది. అనేక మంది ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. గోమా నగరాన్ని విడిచిపెడుతూ అక్కడి వారు కొందరు ట్రక్కులో సురక్షిత ప్రాంతానికి బయలుదేరి వెళుతుండగా, ఆ వాహనం బోల్తా పడి అయిదుగురు చనిపోయారు. అగ్ని పర్వత విస్ఫోటనం కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతూ ఉండగా, గోమా నగర వీధులను లావా ముంచెత్తింది. దట్టమైన పొగ అలముకుంది.
Last Updated : May 24, 2021, 7:15 AM IST