అర్ధరాత్రి దొంగతనం చేసిన ఎలుగుబంటి.! - అమెరికా
అమెరికా కొలొరాడోలో ఆకలితో ఉన్న ఓ ఎలుగుబంటి.. చెత్తడబ్బాను దొంగిలించింది. స్థానిక మందుల(డ్రగ్స్) దుకాణ ఆవరణలోకి ప్రవేశించి పెద్ద లోహపు చెత్తడబ్బాను అలవోకగా గేటు బయటకు లాక్కెళ్లింది. అయితే.. కంటైనర్ మూత తెరిచేందుకు ఎంత ప్రయత్నించినా తెరవలేకపోయిందా భల్లూకం. చివరకు పగలగొడదామని చూసినా విఫలమైంది. అయితే.. మరునాడు చెత్తడబ్బా కోసం వెతికిన యజమానులకు సీసీటీవీల్లో ఆ దృశ్యాలు కనిపించాయి. ఇక ఆశ్యర్యపోవడం వారి వంతైంది.
Last Updated : Jul 25, 2019, 1:11 PM IST