జుమా అరెస్టుతో చెలరేగిన అల్లర్లు- ఆరుగురు మృతి - jacob zuma arrest
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జేకబ్ జుమా అరెస్టుతో ఆ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. అరెస్టును వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆస్తులు, వ్యాపార సంస్థలపై దాడులు చేశారు. ఇదే అదనుగా భావించిన స్థానికులు దుకాణాల్లో దొరికింది దొరికినట్లు ఎత్తుకెళ్లారు. వివిధ హింసాత్మక ఘటనల్లో ఆరుగురు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు సైన్యాన్ని రంగంలోకి దించనున్నట్లు అధికారులు వెల్లడించారు.