బొలీవియాలో కార్చిచ్చు.. 4లక్షల హెక్టార్ల అడవులు దగ్ధం
బొలీవియా తూర్పు ప్రాంతంలో కార్చిచ్చు రగులుకుంది. 4 లక్షల హెక్టార్ల అటవీ భూభాగం, పంటలు, గడ్డి కాలి బూడిదైనట్లు అధికారులు ప్రకటించారు. మంటల వల్ల ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు. లా పాజ్కు 540 మైళ్ల దూరంలో గల సాంటా క్రజ్ ప్రాంతంలో భారీ నష్టం సంభవించింది. 2 వందల మంది సైనిక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బొలీవియా అధ్యక్షుడు ఈవో మోరల్స్ మరో నాలుగు వందల మంది సైనికులను పంపారు. గవర్నర్ రూబెన్ ఈ ప్రాంతాన్ని 'విపత్తు ప్రాంతం'గా ప్రకటించారు.
Last Updated : Sep 27, 2019, 3:29 PM IST