Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడి దర్శనం - తిరుమల బ్రహ్మెత్సవాలు 2021
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. శ్రీవారు ఎర్రటి పూలమాలలు ధరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు. సూర్యప్రభ వాహనంలో ఉండే నారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండపంలో స్వామి వారి వాహన సేవలు నిర్వహిస్తున్నారు.
Last Updated : Oct 13, 2021, 3:37 PM IST