వయ్యారం ఓణి వేసింది... తెలుగుతనం ఉట్టి పడింది - ramzan collection fashion show
గాగ్రా, లంగాఓణిల్లో అచ్చమైన తెలుగు అమ్మాయిల్లా మోడల్స్ మెరిసిపోయారు. ధగధగ మెరిసే తళుక్కుల వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై హంసనడకలతో ఆకట్టుకున్నారు. రంజాన్ పండుగను పురష్కరించుకొని బంజారాహిల్స్‌లోని ఓ వస్త్ర దుకాణం ఘరారా ఫెస్టివల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా నగరానికి చెందిన మోడల్స్‌తో ప్రత్యేక ఫ్యాషన్ షోను నిర్వహించారు. వివిధ వర్ణాలు, విభిన్న వస్త్రాలను మోడల్స్ ప్రదర్శించి మైమరిపించారు.