పబ్‌గా మారిన పేదల ఫంక్షన్ హాల్... చిందులేసిన నేతలు - LEADERS
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్‌ని స్థానిక నేతలు పబ్‌గా మార్చేశారు. సికింద్రాబాద్‌లో ఇంకా పూర్తి కాని ఓ హాలులో వేడుక నిర్వహించడమే కాకుండా... డీజే మోతలతో హోరెత్తిస్తూ చిందులేశారు. ఇంకా అందుబాటులోకి రాని పేదలకు చెందిన భవనంలో కార్యక్రమానికి అనుమతులు ఎవరిచ్చారంటూ స్థానికులు మండిపడుతున్నారు. భారీ శబ్ధాలతో చుట్టుపక్కల వారికి నిద్ర లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.