నోట్లే అక్షితలు!! - money shower at wedding
హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి తంతులో ఓ వింత చోటు చేసుకుంది. నూతన దంపతులను బంధువులంతా అక్షితలు వేసి ఆశీర్వదిస్తున్నారు. అందరిలా తనూ చేస్తే ప్రత్యేకత ఏముంది అనుకున్నాడో ఏమో... ఓ వ్యక్తి వధూవరులపై కరెన్సీ నోట్లు కుమ్మరించాడు. అంతే పెళ్లి వేడుకకు వచ్చినవారంతా ఆసక్తిగా తిలకించారు. లక్షల రూపాయలను జంటపై వేసి ఆశీర్వదిస్తూ... నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోను మీరు చూసేయండి!
TAGGED:
money shower at wedding