ఫైన్ఆర్ట్స్ విద్యార్థుల వినూత్న ప్రదర్శన - STUDENTS
ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు తమ సృజనాత్మకతతో కళరూపాలకు ప్రాణం పోశారు. హైదరాబాద్లో జేఎన్ఏఎఫ్ఏయూ విద్యార్థులు మిర్చి 19 ది ఆర్ట్ హంగామా ఏర్పాటు చేశారు. ప్రదర్శనను తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహాన్ ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వినూత్నమైన రీతిలో ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని జస్టిస్ రాఘవేంద్ర అన్నారు.