నర్సంపేటలో నిష్కల్మషమైన మనసులు హోలీ ఆడాయి - orphans
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్, సంజీవని అనాథాశ్రమంలోని బాలబాలికలు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులు వారికి సహజ రంగులను అందించారు. సుమారు 50 మంది బాలబాలికలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం రెండు విభాగాలుగా విడిపోయి నృత్యాలు చేస్తూ సందడి చేశారు.