ప్రకృతి ఒడిలో బొగత హొయలు చూడతరమా! - ప్రకృతి ఒడిలో జాలువారే బొగత హొయలు
చూట్టూ ఎత్తైన కొండలు. దట్టమైన అటవీ ప్రాంతం. ప్రకృతి నడుమ కనువిందు చేసే సుందర దృశ్యాలు. మేనిని తాకే మంచు ముత్యాల్లా.. పర్యటకులను కట్టిపడేస్తున్న అద్భుత దృశ్యం. ఇలా ప్రకృతి సౌందర్యాన్ని పరవశింపజేస్తూ నింగి నుంచి నేలకు జాలువారిన పాలసంద్రంలా మారిన బొగత జలపాతం కనువిందు చేస్తోంది. ఇక్కడి ప్రకృతి అందాలు సందర్శకుల మనసును దోచుకుంటున్నాయి. కొండ కోనల నుంచి హోరెత్తే నీటి హొయలతో జాలువారే బొగత జలపాతం చూద్దాం రండి.