మట్టి కుండలకు కొత్త అందాలు - మట్టి కుండలకు కొత్త అందాలు
వేసవికాలం వచ్చేసింది. ప్రజలంతా చల్లని నీటి కోసం తహతహలాడుతుంటారు. సంపన్నులు ఫ్రిజ్‌లపై ఆధారపడితే... సామాన్యుడు మాత్రం మట్టి కుండలే రిఫ్రిజిరేటర్‌గా భావిస్తాడు. అందుకే ఈ కాలంలో మట్టి కుండలకు గిరాకీ ఎక్కువ. మరి అలాంటి కుండలపై తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు తయారీదారులు. పల్లె వాతావరణాన్ని తలపించే విధంగా విభిన్నమైన చిత్రాలను కుండలపై రంగులు అద్ది వాటికి కొత్త అందాలను తీసుకువచ్చారు. వరంగల్ ఎంజీఎం కూడలి వద్ద మహారాష్ట్రకు చెందిన వ్యాపారి విక్రయిస్తున్న ఈ కుండలు నగరవాసులకు అమితంగా ఆకర్షిస్తున్నాయి.
Last Updated : Apr 1, 2019, 10:58 PM IST