తెలంగాణ

telangana

Telangana governor attends FDDI annual convention

ETV Bharat / videos

Telangana Governor Attends FDDI Annual Convention : ఎఫ్‌డీడీఐ 3వ వార్షికోత్సవంలో గవర్నర్‌ తమిళిసై - fddi latest news

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 5:26 PM IST

Telangana Governor Attends FDDI Annual Convention in Gachibowli : గచ్చిబౌలిలోని ఫుట్​వేర్ డిజైన్ అండ్ డెవలప్​మెంట్​ ఇనిస్టిట్యూట్ 3వ వార్షికోత్సవం ఎఫ్​డీడీఐ కాన్వకేషన్​లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వార్షికోత్సవంలో ప్రముఖ డిజైనర్ అస్మితా మార్వా, ఎఫ్​డీడీఐ(ఫుట్​వేర్​ డిజైన్​ అండ్​ డెవలప్​మెంట్ ఇనిస్టిట్యూట్​)​ ఎండీ పంకజ్ కుమార్ సిన్హా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

 Annual Day Celebrations Of FDDI Gachibowli : ఫ్యాషన్ డిజైనింగ్, ఫుట్​వేర్ డిజైన్ సహా పలు విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు గవర్నర్ గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన గవర్నర్.. అందరూ తలపై వుండే కిరీటాన్ని చూస్తారు కానీ కాళ్లకు వుండే చెప్పులు ఎవరికీ కనబడవన్నారు. తమిళనాడులో ఒకప్పుడు పిల్లల్లో అనీమియా ఎక్కువగా ఉందని... అది కాళ్ల నుంచి శరీరంలోకి వచ్చే చిన్న క్రిముల కారణం రావచ్చని నిపుణులు పేర్కొన్నారని.. ఇలాంటప్పుడు చెప్పులు ఉపయోగపడ్డాయని అన్నారు. ఫుట్​వేర్ డిజైన్​లో  విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని.. వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details