తెలంగాణ

telangana

venu responds on balagam movie dispute

ETV Bharat / videos

'బలగం' సినిమా కోసం ఆరేళ్లు కష్టపడ్డా.. ఆ వివాదంపై కోర్టుకెళ్తా: దర్శకుడు వేణు - బలగం లేటెస్ట్​

By

Published : Mar 5, 2023, 4:34 PM IST

ఇటీవలే విడుదలై మంచి టాక్​ సంపాదించుకున్న బలగం సినిమా కథ తనదేనంటూ ఓ వ్యక్తి వివాదం సృష్టించడం హాస్యస్పదంగా ఉందని ఆ చిత్ర దర్శకుడు వేణు అన్నారు. బలగం సినిమా కథ.. కథ కాదని తెలుగు ప్రజల సంప్రదాయమని పేర్కొన్నారు. ఆ సంప్రదాయంపై ఏ ఒక్కరికి హక్కు లేదన్నారు. ఆరేళ్లుగా ఎంతో శ్రమించి బలగం కథ తయారు చేసుకున్నానని స్పష్టం చేశారు వేణు. సినిమా థియేటర్​లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న క్రమంలో తనను, తన నిర్మాతలను అబాసుపాలు చేసేలా ఆ వ్యక్తి వివాదం సృష్టించడం అర్థరహితంగా ఉందన్నారు. ఈ విషయంలో తాను కూడా కోర్టును ఆశ్రయించనున్నట్లు వేణు వెల్లడించారు. కాకి ముట్టుడు అనేది తెలంగాణ సంప్రదాయమే కాదు.. తెలుగు సంప్రదాయం అని కూడా వేణు తెలిపారు. ఈ నేపథ్యంగా ఇతర భాషల్లో ఎన్నో చిత్రాలు వచ్చినా వేటికవే ప్రత్యేకమని ఆయన తెలిపారు. బలగం చిత్రాన్ని అబాసుపాలు చేయడం ఆవేదన కలిగించిందన్నారు. రాజు ఈ సినిమాను తీయకపోతే తెలంగాణ సంస్కృతిలో ఈ పాయింట్ ప్రపంచానికి ఎలా తెలిసేదని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details