Ram Charan Baby Name : 'మా పాప పేరేంటో ముందే నిర్ణయించుకున్నాం' - telangana latest news
Upasana Discharged from Apollo Hospital : అనుకున్న సమయానికి దేవుడు తమకు పాపను ఇచ్చి ఆశీర్వదించాడని మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 20న ఉపాసన అపోలో ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. నేడు ఆస్పత్రి నుంచి పాపతో కలిసి డిశ్ఛార్జీ అయ్యింది. ఈ సందర్భంగా తల్లీబిడ్డలతో కలిసి మీడియా ముందుకు వచ్చిన రామ్‌చరణ్.. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉపాసన, పాపకు వైద్యం అందించిన వైద్యులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నారన్న రామ్‌చరణ్.. అభిమానుల ఆశీస్సులు తమ పాపకు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అయితే పాపకు ఏ పేరు పెట్టాలనేది తాను, ఉపాసన నిర్ణయించుకున్నామని.. 21వ రోజు స్వయంగా ప్రకటిస్తానని రామ్‌చరణ్ వెల్లడించారు. పాపతో కలిసి రామ్ చరణ్, ఉపాసన హాస్పిటల్ నుంచి బయటికి రావడంతో అభిమానులు గులాబీల వర్షం కురిపించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా మొయినాబాద్‌లోని ఉపాసన పుట్టింటికి బయల్దేరి వెళ్లారు.