Actor Siddharth Emotional Video : స్టేజ్‌పై కన్నీటి పర్యంతమైన సిద్ధార్థ్.. ఎందుకో తెలుసా? - siddharth emotional speech in telugu
Published : Oct 3, 2023, 7:32 PM IST
Actor Siddharth Emotional Video : టాలీవుడ్ సీనియర్ హీరో సిద్ధార్థ్ కొత్త చిత్రం 'చిన్నా'. ఈ సినిమాలో అంజలీ నాయర్, నిమిష సజయన్ కీలక పాత్రల్లో నటించారు. ఇక చిన్నా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్ మంగళవారం హైదారాబాద్‌లో ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్మీట్లో హీరో సిద్ధార్థ్ భావోద్వేగానికి గురయ్యారు. " ఈ సినిమాను నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని సెన్సార్ చేశాం. తొలిసారి కన్నడ భాష నేర్చుకుని డబ్బింగ్ చెప్పా. కర్ణాటకకు వెళ్లి ప్రెస్‌మీట్ పెడితే 'నువ్వు తమిళ్ వాడివి గెట్ అవుట్' అన్నారు. ' మీ భాష నేర్చుకుని, కొత్తగా ఒక నటుడు మీ ముందుకు వస్తుంటే గెట్ అవుట్' అంటారేంటి అనిపించింది. నా ప్రెస్‌మీట్ ఆపేశారు. నవ్వుతూ నేను బయటకు వెళ్లిపోయా. తర్వాత చాలా మంది సారీ చెప్పారు. కొందరు థాంక్స్ చెప్పారు" అని సిద్ధార్థ్ అన్నారు. ఇంకా ఈ ఈవెంట్లో సిద్ధార్థ్ ఏమన్నారో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.