రైల్వే స్టేషన్లో గజరాజు సంచారం.. ఆందోళనలో ప్రయాణికులు! - ఉత్తరాఖండ్‌లో అడవి ఏనుగుల సంచారం
Elephants in Residential Areas: ఉత్తరాఖండ్‌లో అడవి ఏనుగులు తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. రిషికేశ్‌లో తాజాగా రామ్జులా స్వర్గాశ్రమం ప్రాంతంలో ఆదివారం రాత్రి సమయంలో ఓ గజరాజు సంచరించింది. శివరాత్రి సమయంలో నీలకంఠ యాత్రకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అడవి ఏనుగులు నివాస ప్రాంతాల్లోకి వస్తుండగా.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటు.. హరిద్వార్‌లోనూ అడవి ఏనుగుల బెడద ఎక్కువైంది. అర్ధరాత్రి సమయంలో రైల్వేస్టేషన్లో ఓ ఏనుగు సంచరించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST